English   

గోపీచంద్ సీటీమార్ సినిమా వాయిదా

Gopichand
2021-03-27 16:50:22

మ్యాచో మ్యాన్ గోపీచంద్ మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా హీరో హీరోయిన్ లుగా న‌టించిన సినిమా సీటీమార్‌. ఈ సినిమాకు సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. చిట్టూరి శ్రీనివాస్ రావు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాను స్పోర్ట్స్ బ్యాగ్డ్రాప్ లో తెర‌కెక్కిస్తున్నారు. సినిమాలో గోపీచంద్ ఆంద్ర క‌బ‌డ్డీ జట్టు కెప్టెన్ కాగా త‌మ‌న్నా తెలంగాణ క‌బ‌డ్డీ జ‌ట్టు కెప్టెన్ గా కనిపించ‌నుంది. సినిమా నుండి విడుద‌లైన టీజర్ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఇక ఇప్ప‌టికే ఈ సినిమా డేట్ ను చిత్ర యూనిట్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఎప్రిల్ 2న సినిమాను విడుద‌ల చేస్తున్న‌ట్టు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. అయితే సినిమా విడుద‌ల‌కు ఇంకా ఐదు రోజులు మాత్ర‌మే టైమ్ ఉంది. 

అయితే తాజాగా చిత్ర యూనిట్ సినిమా విడుద‌ల తేదీని వాయిదా వేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ పూర్తి కాని కార‌ణంగా సినిమా విడుద‌ల‌ను వాయిదా వేస్తున్న‌ట్టు వెల్ల‌డించింది. త్వ‌ర‌లోనే విడుద‌ల తేదీని ప్ర‌కటిస్తామ‌ని పేర్కొంది. సినిమా విడుద‌ల వార్త తెలిసి గోపీచంద్ అభిమానులు షాక్ లో ఉన్నారు. ఇక సినిమా క్లైమాక్స్ ఫైట్ సిజి ఫుటేజ్ రావ‌డానికి మ‌రో రెండు మూడు రోజులు టైం ప‌డుతుంద‌ని టాక్ వినిపిస్తోంది. మ‌రో వారంలో సినిమా విడుద‌ల ఉండ‌టం వ‌ర్క్ పూరి కాకపోవ‌డం....ఈ బిజీలో ప్ర‌మోష‌న్స్ కూడా చెయ్య‌క‌పోడంతోనే సినిమా విడుద‌ల ను వాయిదా వేసిన‌ట్టు తెలుస్తోంది. మ‌రో వైపు ఈ చిత్రాన్ని ఎప్రిల్ 30 లేదా ఆ త‌ర‌వాత వారంలో రిలీజ్ చేయాల‌ని చిత్ర యూనిట్ బావిస్తోంద‌ట‌. 

More Related Stories