English   

కొత్త కారు కొనుగోలు చేసిన ప్రభాస్

 Prabhas
2021-03-29 11:22:04

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కొత్త కారును కొనుగోలు చేశారు. ప్రభాస్ లంబోర్గిని ఎస్ రోడ్ స్టర్ కారును తీసుకున్నారు. ఇక ఈ కారును ఇండియా కొనుగోలు చేసిన రెండో వ్యక్తిగా నిలిచిపోయారు. ఈ కారు దాదాపుగా 4 నుండి 6 కోట్ల వరకు ఉంటుంది. బెంగుళూరు షోరూం నుండి ఈ కారు హైదరాబాద్ కు డెలివరీ అయ్యింది. ఇప్పటికే ప్రభాస్ ఈ కారుతో హైదరాబాద్ రోడ్లపై చక్కర్లు కొట్టినట్టు తెలుస్తోంది. ఇక ఇదివరకు ప్రభాస్ రోల్స్ రాయల్స్ కారును వాడారు ఈ కారు ధర లంబోర్గిని కంటే ఎక్కువే ఉంటుంది. దాదాపు గా రోల్స్ రాయల్స్ ధర 8 నుండి 9 కోట్ల వరకు ఉంటుంది.

ఇదిలా ఉండగా ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాధే శ్యామ్ షూటింగ్ ను పూర్తి చేసుకున్నారు. సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆదిపురుష్, సలార్ సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉన్నాడు. ముంబై లో ఆడిపురుష్ తొలి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ సలార్ షూటింగ్ కోసం హైదరాబాద్ కి చేరుకుంటున్నారు. హైదరాబాద్ శివార్లలో సలార్ కోసం భారీ సెట్ ను ఏర్పాటు చేశారు.

More Related Stories