English   

ప్రమోషన్స్ కోసం పాకులాడుతున్న పవర్ స్టార్..

 Puneeth Rajkumar
2021-03-29 11:50:33

పవర్ స్టార్ ఎంట్రీ ప్రమోషన్స్ కోసం పాకులాడడం ఏంటి.. ఆయన ప్రమోషన్ చేస్తాను అనాలే కాని ఎగబడతారు కదా అనుకుంటున్నారా..? ఇదంతా నిజమే.. కానీ ఇక్కడ పవర్ స్టార్ అంటే మన తెలుగు పవర్ స్టార్ కాదు కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్. కర్ణాటకలో ఆయన ఫాలోయింగ్ చూస్తే మతులు పోతాయి. దాదాపు 90 శాతం సక్సెస్ రేటుతో సౌతిండియాలో మరో హీరోకు సాధ్యం కాని రీతిలో రికార్డులు సృష్టిస్తున్నాడు పునీత్. ఇప్పుడు ఈయన తెలుగు ఇండస్ట్రీపై కన్నేశాడు. 

ఈయన నటించిన యువరత్న సినిమాను తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. కే జి ఎఫ్ సినిమా పుణ్యమాని కన్నడ దర్శక నిర్మాతలకు తెలుగు మార్కెట్ పై ఆశలు రేగాయి. ఇప్పటికే సుదీప్, దర్శన్, ధ్రువ సజ్జ లాంటి హీరోలు తెలుగు ఇండస్ట్రీకి వచ్చారు. వీళ్ళ సినిమాలు ఇక్కడ డబ్బింగ్ చేస్తే కనీసం వచ్చినట్టు కూడా ప్రేక్షకులకు తెలియలేదు. సాధారణంగా కన్నడ సినిమాలకు తెలుగులో పోస్టర్ ఖర్చులు కూడా రావు అనే నానుడిని కేజీఎఫ్ తొలగించింది. ఈ సినిమా తెలుగులో సంచలన విజయం సాధించింది. దాంతో మిగిలిన హీరోలు కూడా తెలుగుపై కన్నేశారు. ఈ క్రమంలోనే పునీత్ రాజ్ కుమార్ యువరత్న సినిమాతో వస్తున్నాడు. 

ఈ సినిమా కోసం తెలుగులో ప్రమోషన్స్ కూడా చేస్తున్నాడు. కన్నడలో ఎంత పెద్ద స్టార్ అయినా కూడా తెలుగులో ఈయన ఎవరో చాలామందికి తెలియదు. అందుకే తన సినిమా ప్రమోషన్ దగ్గరుండి చేస్తున్నాడు. ఏప్రిల్ 1న ఈ సినిమా విడుదల కానుంది. పైగా ఈ సినిమాలో సాయి కుమార్, ప్రకాష్ రాజ్ లాంటి తెలిసిన మొహాలు ఉండటంతో తెలుగులో కూడా యువరత్నను ఆదరిస్తారని నమ్మకంగా ఉన్నాడు పునీత్ రాజ్ కుమార్. ఏదేమైనా కూడా ఈయన ప్రమోషన్స్ చూస్తుంటే సినిమాకు ఓపెనింగ్స్ వచ్చేలా ఉన్నాయి.

More Related Stories