English   

వకీల్ సాబ్ పై క్రేజీ న్యూస్ లీక్ చేసిన బోణీకపూర్

Boney Kapoor
2021-03-29 12:52:07

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తరవాత చేస్తున్న సినిమా వకీల్ సాబ్. బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన పింక్ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు బోణీ కపూర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే సినిమా  విడుదలకు ముందు నిర్మాత బోణీ కపూర్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తమిళంలో ఈ సినిమాను అజిత్ తో తెరకెక్కిస్తున్నామని అన్నారు. అయితే తమిళ రీమేక్ లో ఫైట్ సీన్ ను పెట్టామని అన్నారు. 

ఇక తెలుగులో పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు తగినట్టుగా వకీల్ సాబ్ లో మార్పులు చేశామన్నారు. ఇక్కడి ప్రేక్షకుల అంచలనాలు దృష్టిలో పెట్టుకుని యాక్షన్ సన్నివేశాలను జొప్పించామని అన్నారు. తమిళం కంటే తెలుగులో ఒక ఫైట్ సీన్ ను ఎక్కువగా తీశామని అన్నారు. హిందీలో అమితాబ్ ఏజ్ మీదపడిన లాయర్ గా కనిపించారు. తెలుగులో పవన్ సత్యదేవ్ అనే యంగ్ లాయర్ పాత్రలో కనిపించబోతున్నారు. అందుకే యాక్షన్ డోస్ పెంచామని అన్నారు. ఇదిలా ఉండగా ఎప్రిల్ 9 న వకీల్ సాబ్ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో వేగం పెంచారు. అంతే కాకుండా వకీల్ సాబ్ ట్రైలర్ ను మార్చ్ 29 న సాయంత్రం విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. దాంతో సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ వకీల్ సాబ్ ను ట్రెండ్ చేస్తున్నారు.

More Related Stories