English   

వకీల్ సాబ్ కోసం నేను కూడా ఎదురు చూస్తున్నా..నివేదా థామస్

Nivetha Thomas
2021-03-29 16:27:37

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా వకీల్ సాబ్. ఈ సినిమాలో వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. సినిమాలో పవన్ కూడా జోడిగా శృతి హాసన్ నటించింది. ఈ సినిమాలో అంజలి, నివేదా థామస్, అనన్య నాగోళ్ల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా ఎప్రిల్ 9 న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ లలో చిత్ర యూనిట్ బిజీగా వుంది. అంతే కాకుండా సినిమా నుండి విడుదలయ్యే టీజర్ లకు..పాటలకు ముందు సినిమాలో నటిస్తున్న సెలబ్రెటీలతో వీడియోలు తీసి హైప్ తీసుకువస్తున్నారు. 

ఇక ఈ సినిమా ట్రైలర్ ను ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు విడుదల చేస్తున్న నేపథ్యంలో నివేదా థామస్, దర్శకుడు వేణు శ్రీరామ్ లు వీడియోలను విడుదల చేసారు. వీడియోలో నివేదిత థామస్ మాట్లాడుతూ...పవన్ కళ్యాణ్ చాలా కాలం తరవాత చేస్తున్న సినిమా అని సినిమా ట్రైలర్ కోసం తాను ఎంతగానో వెయిట్ చేస్తున్నానని చెప్పింది. ట్రైలర్ ను కరోనా నిబంధనలు పాటిస్తూ అందరూ థియేటర్ లో చూడాలని చెప్పింది.

More Related Stories