English   

వ‌కీల్‌ సాబ్ ట్రైల‌ర్ రికార్డులు..నెవ‌ర్ బిఫోర్‌..ఎవ‌ర్ ఆఫ్ట‌ర్

Vakeel Saab
2021-03-30 11:37:58

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టించిన వ‌కీల్ సాబ్ సినిమా ట్రైల‌ర్ ఆదివారం విడుద‌లైంది. తాజాగా విడుద‌లైన ఈ ట్రైల‌ర్ రికార్డులు సృష్టిస్తోంది. 2018లో ఆజ్ఞాత‌వాసి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌ళ్లీ ఇన్నేళ్ల త‌ర‌వాత స్క్రీన్ పై మెరిసారు. దాంతో ప‌వ‌న్ అభిమానులు పూన‌కాల‌తో ఊగిపోతున్నారు. ట్రైల‌ర్ కు బ్ర‌హ్మ‌ర‌థం పడుతున్నారు. నిన్న విడుద‌లైన వ‌కీల్ సాబ్ ట్రైల‌ర్ కు కొన్ని గంట‌ల్లోనే 9 మిలియ‌న్ రియ‌ల్ టైమ్ వ్యూవ్స్ వ‌చ్చాయి. అంతే కాకుండా యూట్యూబ్ లో ఈ ట్రైల‌ర్ నంబ‌ర్ 1 స్థానంతో ట్రెండింగ్ లో ఉంది. 

ఇదిలా ఉండ‌గా బాలీవుడ్ సినిమా పింక్ రీమేక్ గా వ‌స్తున్న ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సినిమాను దిల్ రాజు, బోణీక‌పూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ల్యాణ్ కు జంట‌గా శృతి హాస‌న్ న‌టింస్తోంది. అంతే కాకుండా సినిమాలో నివేధితా తామ‌స్‌, అన‌న్య నాగోళ్ల‌, అంజ‌లి కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఎప్రిల్ 9న వ‌కీల్ సాబ్ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ట్రైల‌ర్ కు వ‌చ్చిన క్రేజ్ చూస్తుంటే వ‌కీల్ సాబ్ రీకార్డులు క్రియేట్ చేయ‌డం కాయ‌మ‌ని అర్థ‌మ‌వుతోంది.  

More Related Stories