English   

ల‌వ్ స్టోరీ వాయిదా పై క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్

Love Story
2021-03-30 15:24:56

అక్కినేని నాగ చైత‌న్య‌, రౌడీ బేబీ సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన చిత్రం ల‌వ్ స్టోరీ. ఈ చిత్రానికి శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాను కే.నారాయ‌ణ్ దాస్ నారంగ్‌, పి. రాంమోహ‌న్ రావు నిర్మించారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ చిత్ర టీజ‌ర్ మ‌రియు పాట‌లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా సినిమా నుండి విడుద‌లైన సారంగ‌ద‌రియా పాటకు రికార్డు స్థాయిలో వ్యూవ్స్ వ‌చ్చాయి. సాయి ప‌ల్ల‌వి కెరీర్లో  ఈ సాంగ్ మ‌రో సూప‌ర్ హిట్ గా నిలిచింది. అంతే కాకుండా సినిమాకు ప్ర‌మోష‌న్స్ గా మారింది. ఈ సినిమాకు ప‌వ‌న్ సీహెచ్ స్వ‌రాలు స‌మ‌కూర్చారు. చిత్రాన్ని తెలంగాణ బ్యాగ్డ్రాప్ లో తెర‌కెక్కిస్తున్నారు.   

ఇదిలా ఉండ‌గా ల‌వ్ స్టోరీ సినిమాను ఎప్రిల్ 16న విడుద‌ల చేస్తామ‌ని చిత్ర యూనిట్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించేసింది. అయితే సినిమా విడుద‌ల వాయిదా ప‌డింద‌ని వార్తలు వ‌స్తున్నాయి. అయితే ఈ ప్ర‌చారం పై తాజాగా చిత్ర యూనిట్ స్పందించింది. సినిమా విడుద‌ల విష‌యంలో ఎలాంటి కన్య్ఫూజ‌న్ లేద‌ని చెప్పింది. మా అంద‌మైన చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నామ‌ని తెలిపింది. శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలకు ప్ర‌త్యేక అభిమానులు ఉంటారు. ఆయ‌న తెర‌కెక్కించే క్లాసిక్ ప్రేమ క‌థ‌లు చూడ‌టానికి ఎదురు చూస్తుంటారు. ఇక ల‌వ్ స్టోరీ ఎలా ఉంటుందో చూడాలి. 

More Related Stories