English   

నితిన్ బ‌ర్త్ డే వేడుక‌లో సంద‌డి చేసిన సునీత దంప‌తులు

Nithiins birthday
2021-03-30 18:34:24

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఈరోజు తన 38వ పుట్టిన రోజును జరుపుకుంటారు. పెళ్లి తరవాత నితిన్ కు ఇదే మొదటి పెళ్లిరోజు కావడంతో ఆయన కుటుంబ సభ్యులతో పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్బంగా నితిన్ కు అభిమానులు సినిప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. నితిన్ బర్త్ డే లో భార్య షాలిని తో పాటు అత్యంత సన్నిహితులు పాల్గొన్నారు. అంతే కాకుండా ఇటీవలే పెళ్లి చేసుకున్న సింగర్ సునీత ఆయన భర్త మ్యాంగో రామ్ తో కలిసి హాజరయ్యారు. 

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫొటోలో సునీత భర్త రామ్ కౌగిలిలో వాలిపోయింది. ఇక రామ్ నితిన్ ముందు నుండే మంచి ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. సునిత రామ్ ల ప్రీ వెడ్డింగ్ పార్టీకి నితిన్ దగ్గరుండి అన్ని పనులను చూసుకున్నారు. ఇదిలా ఉండగా నితిన్ ఈ ఏడాది ప్రారంభంలోనే చెక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా బోల్తా పడటం తో కాస్త నిరాశ చెందారు. అయితే ఆ తరవాత వచ్చిన రంగ్ దే సినిమాకు హిట్ టాక్ రావడంతో ఖుషీలో ఉన్నారు.

More Related Stories