English   

ఆచార్య లాహే లాహే సాంగ్ .. మ‌ణిశ‌ర్మ మ్యూజిక్.. చిరు స్టెప్పులు 

Acharya​​
2021-03-31 16:27:06

మెగాస్టార్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ మూవీ లోని ‘లాహే.. లాహే..’ అంటూ సాగే సాంగ్ ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు.  మునుప‌టిలా చిరు స్టైలిష్ డ్యాన్స్ తో మెస్మరైజ్‌ చేసేశారు. రామ‌జోగ‌య్య శాస్త్రి రాసిన ఈ పాట‌ను హారిక నారాయ‌ణ్‌, సాహితి చాగంటి పాడారు. ఫోక్ మెలోడీగా సాగే ఈ పాట‌కు మ‌ణిశ‌ర్మ మ్యూజిక్ ప్రాణం చేసింద‌నే చెప్పాలి..

దేవాదాయ శాఖ నేపథ్యంలో ఆచార్య చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.ఆచార్య సినిమాలో రామ్‌చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ‘ఆచార్య’టీజర్‌ సినిమాపై భారీ అంచనాలు పెంచింది. ఈ చిత్రాన్ని రామ్‌చరణ్, నిరంజన్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

More Related Stories