English   

రెండో పెళ్ళి నాకు ఓకే..నాగ‌బాబు షాకింగ్ కామెంట్

Naga Babu
2021-03-31 17:12:17

టవర్ స్టార్ నాగబాబు సినిమా లకంటే కాంట్రవర్సీలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తారు. నాగబాబు ఓ వైపు బుల్లి తెరపై సందడి చేస్తూ ఓ యూట్యూబ్ ఛానల్ కూడా ఏర్పాటు చేసి వీడియోలు చేస్తున్నారు. అంతే కాకుండా నాగబాబు కుర్ర హీరోలకంటే ఎక్కువగా సోషల్ మీడియాను వాడుతూ ఉంటారు. ఇక ఈ మధ్య అయితే ఎక్కువ సమయం ఇన్స్టాగ్రామ్ లోనే గడుపుతూ తరచు లైవ్ లోకి వచ్చి ఫ్యాన్స్ తో ముచ్చటిస్తున్నారు. తాజాగా నాగబాబు మరోసారి లైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ నెటిజెన్ మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటారా అంటూ ప్రశ్నించారు. దానికి నాగబాబు తనదైన స్టైల్ లో సమాధానం ఇచ్చారు. 

" ఈ వయసులో పెళ్లా..మీరంతా ఒకే అంటే నాకు ఒకే" అంటూ నాగబాబు సమాధానం ఇచ్చారు. నిజానికి నాగబాబు ఆ ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వకుండా ఉండాల్సింది. కానీ అలా చేస్తే నాగబాబు ఎలా అవుతారు...ఆయన మాటలకు ఎంతోమంది అభిమానులు ఎందుకు ఉంటారు. ఇక నాగబాబు ఆన్సర్ పై విమర్శలు కూడా రాకపోలేదు. కొంతమంది నెటిజెన్ లు ఈ వయసులో మళ్ళీ పెళ్ళెందుకు సార్..ఆల్రెడీ కూతురు పెళ్లి చేశారు. ఇక కొడుకు పెళ్లి చేసి మనవళ్లను ఆడించండి అంటూ కామెంట్ నెటిజెన్ లు కామెంట్ చేస్తున్నారు. ఇక మరి కొందరు నెటిజెన్ లు నాగబాబు ఫన్నీగా అన్నారు.. దాన్ని కూడా సీరియస్ గా తీసుకుంటే ఎలా అంటూ కామెంట్ చేస్తున్నారు.

More Related Stories