English   

సురేఖ వాణి కూతురుకు షాక్ ఇచ్చిన నెటిజెన్స్

Surekha Vani
2021-03-31 17:46:30

టాలీవుడ్ లో కొంతమంది సెలబ్రెటీల వారసులు సోషల్ మీడియా ఎఫెక్ట్ కారణంగా బుల్లి సెలబ్రెటీలు అయిపోయారు. ఇప్పటివరకు ఏ సినిమాలో నటించకపోయినా పాపులరిటీ మాత్రం సంపాదించుకున్నారు. ఆ లిస్ట్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాని కూతురు కూడా ఒకరు. తల్లి సురేఖ వాణి తో కలిసి సుప్రీత సోషల్ మీడియాలో ఎప్పుడూ సందడి చేస్తూ కనిపిస్తుంది. ఈ ఇద్దరి ఫోటోలు వీడియోలు చూసిన నెటిజెన్ లు వీళ్ళు అక్కా చెల్లెల్లా..లేదంటే తల్లీ కూతుల్లా అంటూ షాక్ అవుతారు. ఇక ఇద్దరు కలిసి టిక్ టాక్ వీడియోలు చేశారంటే లైకులు వర్షం కురవాల్సిందే. 

ఈ నేపథ్యంలోనే సుప్రీతకు దాదాపు మూడు లక్షలకు పైగా అభిమానులు కూడా ఉన్నారు. అయితే తాజాగా నెటిజెన్ లు సుప్రీత కు ఊహించని షాక్ ఇచ్చారు. ఆమె ఇన్స్టాగ్రామ్ పేజీని అన్ఫాలో చేయడం మొదలుపెట్టారు. ఈ విషయాన్ని సుప్రీత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేసి తెగ బాధపడింది. గత వారం రోజుల్లోనే 422 మంది ఫాలోవర్స్ సుప్రీతను అన్ ఫాలో చేశారు. దాంతో ఏం పాపం చేసాను ఫ్రెండ్స్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఇక ఇటీవల సుప్రీత మీడియా పై ఫైర్ అయిన సంగతి తెలిసిందే. త్వరలో సురేఖా వాని పెళ్లి పీటలు ఎక్కబోతుంది..అంటూ వార్తలు రావడం పై సుప్రీత స్పందించింది. ఉన్నవి మాత్రమే రాయాలని..కొత్తవి క్రియేట్ చేసి రాయవద్దని సుప్రీత ఫైర్ అయ్యింది. దాంతో ఏమైనా సుప్రీత పై అభిమానులు హర్ట్ అయ్యారో ఏమో గానీ అన్ ఫాలో కొట్టేస్తున్నారు.

More Related Stories