English   

రామ్ గోపాల్ వర్మకు రెండో పెళ్లి.. కరోనా కంటే దారుణం ఇది..

 RGV
2021-04-01 11:20:13

అవునా ఇది ఎప్పుడు జరిగింది.. పెళ్లి అంటేనే వర్మకు ఇష్టం ఉండదు. మరి అలాంటిది రెండో పెళ్లి ఎలా చేసుకున్నాడు అనుకుంటున్నారా..? నమ్మడానికి ఎంత చిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. కేవలం తెలుగు ఇండస్ట్రీలో కాదు వరల్డ్ సినిమా ఇండస్ట్రీలో రామ్ గోపాల్ వర్మ కంటే చిత్రమైన దర్శకుడు మరొకరు ఉండరు. ఆయన ఏం చేసినా సంచలనమే.. సంచలనం అయితేనే ఆయన చేస్తాడు. సంవత్సరమంతా ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు వర్మ. 

లాక్ డౌన్ అయిపోయి ప్రపంచం స్తంభించిపోయిన సమయంలో కూడా వారానికి ఒక సినిమా విడుదల చేసిన ఘనుడు ఈయన. దానికి తోడు ఎప్పటికప్పుడు అమ్మాయిలతో చాటింగ్.. హీరోయిన్లతో డేటింగ్ ఈయన ప్రత్యేకత. ఒకసారి ఒక హీరోయిన్ ని పరిచయం చేశాడు అంటే ఆమెలోని టాలెంట్ మొత్తం అయిపోయేంత వరకు మరో అమ్మాయి జోలికి వెళ్ళడు. పొద్దున్న లేస్తూనే సెక్స్ సినిమాలు చూస్తానని ఓపెన్ గా చెప్తాడు. ఇలాంటి దర్శకుడు రెండో పెళ్లి చేసుకున్నాడు అంటే నమ్మడం పెద్ద కష్టమేం కాదు. 

ఇప్పుడు కూడా వరస సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఓటీటీ వచ్చిన తర్వాత రాంగోపాల్ వర్మ నుంచి సినిమాల సంఖ్య కూడా పెరిగింది. ఇంత బిజీలో కూడా పెళ్లి ఎలా చేసుకున్నాడు అనుకుంటున్నారా.. అయితే కాసేపు నీ ఊహలకు బ్రేక్ వేయండి. ఆయన పెళ్లి చేసుకోలేదు. జస్ట్ ఎప్రిల్ ఫూల్ అంతే. ప్రపంచంలో అందరిని ఆయన ఫూల్ చేస్తాడు. అందుకే ఇప్పుడే పెళ్లి పేరు చెప్పి ఆయనను ఫూల్ చేస్తే తప్పేంటి అంటున్నారు నెటిజన్లు.

More Related Stories