English   

ఆదిపురుష్ షూటింగ్ సెట్ లో డైరెక్ట‌ర్ కండీష‌న్స్

Adipurush
2021-04-01 13:48:53

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌బాస్ ప్ర‌స్తుతం ఆదిపురుష్ సినిమాలో న‌టిస్తున్నారు. ఈ సినిమాకు బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. పౌరాణిక రామాయ‌ణం ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్ర‌భాస్ రాముడి పాత్ర‌లో న‌టిస్తుండ‌గా విల‌న్ గా బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీఖాన్ న‌టిస్తున్నారు. అంతే కాకుండా సినిమాలో ప్ర‌భాస్ కు జోడీగా కృతి స‌న‌న్ న‌టిస్తోంది. 

ఇక ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబై లో జ‌రుగుతోంది. అయితే ప్రస్తుతం క‌రోనా విజృంభ‌న మ‌ళ్లీ మొద‌లైన సంగ‌తి తెలిందే. రోజు రోజుకు కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. దాంతో ఆదిపురుష్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ షూటింగ్ లో కండీష‌న్స్ పెట్టార‌ట‌. షూటింగ్ స్పాట్ లో పాతిక‌మంది కంటే ఎక్కువ మంది ఉండ‌కూడద‌ని ద‌ర్శ‌కుడు సిబ్బందికి సూచించార‌ట‌. అంతే కాకుండా చిత్రం బృదం కోసం సానిటైజ‌ర్ ల‌ను ఏర్పాటు చేసార‌ట‌. 

మ‌రోవైపు షూటింగ్ పూర్త‌యిన వెంట‌నే సెట్ లో ప్ర‌తిరోజూ సానిటైజేష‌న్ చేస్తున్నారట‌. ఇక వ‌చ్చేనెల రెండోవారం వ‌ర‌కు ముంబైలోనే ఆదిపురుష్ షూటింగ్ జ‌ర‌గ‌నుంది. ఆ త‌ర‌వాత ప్ర‌భాస్ స‌లార్ షూటింగ్ లో పాల్గొంటారు. ఇక సలార్ షూటింగ్ హైద‌రాబాద్ లో జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే స‌లార్ కోసం హైద‌రాబాద్ శివార్ల‌లో ఓ భారీ సెట్ ను కూడా ఏర్పాటు చేసిన‌ట్టు తెలుస్తోంది. 

More Related Stories