రజనీకాంత్‌కు మోదీ కేసీఆర్ శుభాకాంక్షలు

2021-04-01 14:47:10
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావడం పట్ల ప్రధాని నరేంద్రమోదీ మరియు తెలంగాణ సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపారు. తరాలుగా చెక్కుచెదరని ఖ్యాతి, కఠోరశ్రమకు, విభిన్నపాత్రలకు, అరుదైన వ్యక్తిత్వానికి ప్రతిరూపం రజనీకాంత్ అంటూ ట్వీట్ చేశారు. తలైవాకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దక్కడం పట్ల ఆనందంగా ఉందని మోదీ పేర్కొన్నారు.
నటుడిగా దశాబ్దాల పాటు తనకంటూ ఒక ప్రత్యేక శైలిని చాటుకుంటూ, నేటికీ దేశ విదేశాల్లో కోట్లాదిమంది అభిమానుల ఆదరణ పొందుతున్న రజనీకాంత్‌కు ఫాల్కే అవార్డు రావడం గొప్ప విషయమని సీఎం అన్నారు. ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికైన సందర్భాన సూపర్ స్టార్ రజనీకాంత్‌కు శుభాకాంక్షలని ప్రకటనలో కేసీఆర్ తెలిపారు.