English   

 దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారం..రజనీకి శుభాకాంక్షల వెల్లువ

Dada Saheb Phalke award
2021-04-01 15:46:42

సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్‌కు కేంద్ర ప్ర‌భుత్వం  దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో సినీ ప్రముఖులు త‌మ సోష‌ల్ మీడియా ద్వారా శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. 

‘వెండితెర వేదికగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకోవచ్చని నిరూపించిన, సూపర్‌స్టార్‌, నా ఆప్తమిత్రుడు రజనీకాంత్‌.. దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారానికి నూరుశాతం అర్హుడు’ - కమల్‌హాసన్‌

‘‘నా ప్రియమైన మిత్రుడు రజనీకాంత్‌కు దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారం దక్కడం అత్యంత ఆనందకరమైన విషయం. రజనీ.. నీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. భారతీయ చలన చిత్ర పరిశ్రమకు నువ్వు అందిస్తున్న సేవలు అనిర్వచనీ యమైనవి’’ - మెగాస్టార్‌ చిరంజీవి.

‘‘దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారాన్ని పొందిన రజనీ సర్‌కు అభినందనలు. భారతీయ చిత్రపరిశ్రమకు మీరు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివి. ఎంతోమందికి మీరు స్ఫూర్తి’’ - మహేశ్‌బాబు.

‘దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారం పొందిన సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు’ - వెంకటేశ్‌ 

More Related Stories