English   

రోజా ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీసిన బాలయ్య

Balakrishna roja
2021-04-01 18:38:13

ఏపీఐఐసీ ఛైర్మెన్ నగరి ఎమ్మెల్యే రోజా అనారోగ్యం బారిన పడిన సంగతి తెలిసిందే. ఇటీవల రోజా భర్త సెల్వమని తన భార్య అనారోగ్యం బారిన పడిందని చెన్నై అపోలో ఆస్పత్రిలో రెండు మేజర్ ఆపరేషన్ లు చేయించామని చెప్పారు. దాంతో రోజా సన్నిహితులు, పార్టీ నేతలు ఆమె ఆరోగ్యం పై ఆరా తీస్తున్నారు. అయితే తాజాగా టీడీపీ నేత హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ రోజా ఆరోగ్య పరిస్థితి పై ఆరా తీసినట్టు తెలుస్తోంది. 

బాలయ్య రోజా దగ్గరి బంధువులకు ఫోన్ చేసి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి పై ఆరా తీశారట. ఆమె త్వరగా కోలుకోవాలని దైనందిన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని బాలయ్య కోరుకున్నారట. ఇక రోజా రాజకీయాల ప్రత్యర్థి అయినప్పటికీ బాలయ్య తో కలిసి గతంలో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. సినిమా రంగం కారణంగా వీరిద్దరి మధ్య ఏర్పడిన బంధం ఇప్పటికీ అలానే కొనసాగుతోంది. ఇక బాలయ్య రోజా ఆరోగ్యం పై ఆరాతీయడం రాజకీయవర్గాల్లో చర్చగా మారింది. కాగా రాజకీయాలు వ్యక్తిగత జీవితం వేరువేరు అనే  అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

More Related Stories