English   

శంకర్ కు షాక్ ఇచ్చిన లైకా...చరణ్ తో సినిమాకు బ్రేక్

 Shankar
2021-04-01 19:08:25

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ తో ఓ సినిమాకు ఓకే చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తార‌ని అనౌన్స్ చేశారు. అంతే కాకుండా చ‌ర‌ణ్ ఆర్ఆర్ఆర్, ఆచార్య షూటింగ్ లు పూర్తి చేసుకుని ఈ ప్రాజ‌క్టులోనే బిజీ అవ‌తారని అంతా అనుకున్నారు. ఇక చెర్రీ ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవ‌దుల్లేకుండాపోయాయి. త‌మ హీరో సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ తో సినిమా చేస్తున్నాడ‌ని..ఈ సినిమా త్వర‌లోనే ప‌ట్టాలెక్క‌బోతుంద‌ని సంబుర‌ప‌డ్డారు. 

అయితే ఇప్ప‌టికే అనౌన్స్మెంట్ ఇచ్చిన ఈ సినిమా షూటింగ్ కు మాత్రం బ్రేక్ ప‌డేలా క‌నిపిస్తుంది. శంకర్ ఆ ప్రాజ‌క్ట్ అనౌన్స్మెంట్ ఇవ్వ‌కముందే కమ‌ల్ హాస‌న్ తో ఇండియా 2 సినిమా షూటింగ్ లో బిజీలో ఉన్నారు. అయితే ఇటీవ‌ల షూటింగ్ సెట్ లో అగ్నిప్ర‌మాదం జ‌ర‌గ‌టం..ఆస్తి, ప్రాణ నష్టం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. దాంతో ఈ చిత్ర షూటింగ్ కు బ్రేక్ ప‌డింది. అయితే ఈ సినిమా షూటింగ్ మ‌ళ్లీ మొద‌లౌతుందా లేదా అన్న అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. 

అంతే కాకుండా శంక‌ర్ కూడా చ‌ర‌ణ్ తో సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లే ప్లాన్ లో ఉన్నాడు. దాంతో ఇండియ‌న్ 2 చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ శంక‌ర్ కు షాక్ ఇచ్చింది. ఇండియన్ 2 సినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభించ‌క‌పోవ‌డంపై లైకా అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. తాము కేటాయించిన 230 కోట్ల బ‌డ్జెట్ లో ఇప్టటికే 180 కోట్లు ఖ‌ర్చు అయ్యాయ‌ని కోర్టుకు లైకా తెలిపిన‌ట్టు స‌మాచారం. దీంతో ఈ వ్యవ‌హారం మ‌రింత ముదిరేలా ఉంది. ఈ నేప‌థ్యంలో చ‌ర‌ణ్ తో సినిమా ఇప్పుడు మొద‌ల‌వుతుందా లేదంటే బ్రేక ప‌డిన‌ట్టేనా అన్న అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. 
 

More Related Stories