English   

ప్రీమారిటల్ సెక్స్ అనేది వ్యక్తిగత విషయం.. హీరోయిన్ అంజలి

 Anjali
2021-04-01 19:40:39

'పవర్ స్టార్' పవన్ కళ్యాణ్ కొత్త సినిమా 'వకీల్ సాబ్' ఏప్రిల్ 9న  ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతోంది. ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించింది అంజలి. "వకీల్ సాబ్" గురించి, ఈ చిత్రంలో తన పాత్ర గురించి అంజలి తెలిపారు. ఆ విశేషాలు ఆమె మాటల్లో చూస్తే...

పవన్ కళ్యాణ్ గారితో నటించడం మొదట్లో కొన్ని రోజులు ఇబ్బందిగానే ఉండేది. ఆయన వస్తుంటే సెట్ లో పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది. నేను జనరల్ గా ఎక్కువగా మాట్లాడుతాను. అలాంటి టైమ్ లో నా వల్ల మిగతా వారు ఏదైనా డిస్ట్రబ్ అవుతారా అని భయపడ్డాను. పవన్ గారు చాలా ఇన్ పుట్స్ ఇస్తూ సినిమా చేయించారు. అవన్నీ చూశాక మన క్యారెక్టర్ మనం సరిగ్గా చేస్తే సరిపోతుంది అనే నమ్మకం వచ్చింది. నాకూ, నివేదా, అనన్యకు మధ్య చాలా సీన్స్ ఉంటాయి. మా మధ్య రిలేషన్ లేకుంటే క్యారెక్టరైజేషన్స్ సరిగ్గా రావు. మా మధ్య చాలా తక్కువ టైమ్ లో బాండింగ్ ఏర్పడింది. అందువల్ల నటించేప్పుడు చాలా ఈజీ అయ్యింది. 

వకీల్ సాబ్ ను పింక్ తో పోల్చితే, పింక్ కథలోని సోల్ ఇందులో అలాగే ఉంటుంది. మార్పులన్నీ ఆ మెయిన్ స్టోరీ చుట్టూ చేశారు. మహిళల మీద జరిగే అఘాయిత్యాలు మనకు నిత్యకృత్యం అయ్యాయి. ఆ వార్తలు మనకు కామన్ అయి పోయాయి. మన ఇంట్లో ఇలాంటిది జరిగితే ఎలా రెస్పాండ్ అవుతాం అనేది చూపిస్తున్నాం. ఇలాంటి సందర్భాలు ఏ అమ్మాయికీ రాకూడదు. 

ప్రీమారిటల్ సెక్స్ అనేది వ్యక్తిగత విషయం. వారి వారి ఇష్టాలను బట్టి ఉంటుంది. ఎవరి ఆలోచనలు బట్టి అది ఆధారపడి ఉంటుంది. ఫెమినిజం అనే విషయాన్ని గుడ్ వేలో వాడితే మంచిదనేది నా ఉద్దేశం. నేను గతంలో కొన్ని గుర్తుండిపోయే క్యారెక్టర్స్ చేశాను. వాటిలో వకీల్ సాబ్ క్యారెక్టర్ తప్పకుండా ఉంటుందని చెప్పగలను. 

వకీల్ సాబ్ లో ప్రకాష్ రాజ్ గారితో మరోసారి పనిచేసే అవకాశం వచ్చింది. రెండు సీన్స్ లో ప్రకాష్ రాజ్ గారితో కలిసి నటించాను. మన ఎదుట ఉన్న ఆర్టిస్ట్ బాగా నటిస్తేనే, మనకూ ఆ టైమింగ్ వస్తుంది. వాళ్లు ఫర్మార్మ్ చేయకుంటే మనమూ డల్ అ‌వుతాం. ప్రకాష్ రాజ్ గారితో పనిచేసినప్పుడు మనకూ ఆ ఎనర్జీ వస్తుంది.

ట్రైలర్ లో మీరు చూసిన సీన్ చేశాక పవన్ గారు క్లాప్ కొట్టి నన్ను అప్లాజ్ చేశారు. సాధారణంగా పవన్ గారు ఎక్స్ ప్రెసివ్ గా ఉండరు. కానీ ఆయన ప్రశంసించాక సంతోషం కలిగింది. తెలుగు, తమిళంలో కొన్ని ఎగ్జైటింగ్ చిత్రాలు చేస్తున్నాను. వాటి వివరాలు త్వరలో చెబుతాను.

ఏ నాయికైనా తన కెరీర్ ను ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు అనే దానిపై ఆమె కెరీర్ ఆధారపడి ఉంటుంది. నాకు కెరీర్ లో ఎప్పుడూ గ్యాప్ రాలేదు. నచ్చిన సినిమాలు ఎంపిక చేసుకుంటూ నటిస్తున్నాను. నేను ఇప్పుడు ఏ దారిలో వెళ్తున్నానో భవిష్యత్ లోనూ అలాగే కంటిన్యూ చేస్తున్నాను." అంటూ తన ఇంటర్వ్యూ ని ముగించారు.

More Related Stories