English   

ఆర్ఆర్ఆర్..అజ‌య్ దేవ్‌‌గ‌న్ కు బర్త్ డే గిఫ్ట్ 

 Rajamouli
2021-04-02 16:18:51

బాహుబలి ప్రాజెక్ట్ తర్వాత టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. నేడు బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అజయ్ దేవగణ్ పాత్రను రివీల్ చేస్తూ ఓ సర్‌ప్రైజ్‌ను దర్శకుడు రాజమౌళి తీసుకొచ్చారు.  మూవీలో కీలకపాత్ర పోషిస్తున్న అజయ్ దేవగణ్ పాత్రను తెలిపేలా ఓ మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌లో లోడ్, ఎయిమ్, షూట్ అంటూ ఉద్వేగ‌పూరితంగా సౌండ్ ఇచ్చారు. ఇప్పటికే ఎన్టీఆర్‌,రామ్‌చరణ్, ఒలివియా, ఆలియాభట్‌ ఫస్ట్‌లుక్‌లను చిత్రబృందం విడుదల చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 13న విజయదశమి సందర్భంగా ఆర్ఆర్ఆర్ మూవీ విడుదల తేదీని సైతం గతంలోనే ప్రకటించారు. దసరా కానుక కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

More Related Stories