English   

చరణ్ హీరోయిన్ కు కరోనా..టెన్షన్ లో ఆర్ఆర్ఆర్ టీమ్

Alia Bhatt
2021-04-02 16:55:38

కరోనా విజృంభన మళ్లీ మొదలైంది. తగ్గినట్టే తగ్గి మళ్ళీ కేసులు నమోదవుతున్నాయి. సాధారణ ప్రజలతో పాటు సెలబ్రెటీలు అధికారులు సైతం కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. ఇక ఇప్పుడిప్పుడు మళ్ళీ గాడినపడుతున్న సినీ పరిశ్రమలో కరోనా టెన్షన్ మొదలయ్యింది. ఇప్పటికే పలువురు నటీనటులు కరోనా బారిన పడి ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో  ఎక్కువగా కేసులు నమోదావుతున్నాయి.

తాజాగా ఆర్ఆర్ఆర్ హీరోయిన్ అలియా భట్ కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని అలియా భట్.తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని. డాక్టర్ ల సూచనల మేరకు మందులు తీసుకుంటున్నా అని వెల్లడించింది. తనకోసం ప్రార్థిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపింది. అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇదిలా ఉండగా అలియా ప్రస్తుతం గంగు బాయ్   కథియావాడి సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రానికి సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహిస్తున్నారు. 

అయితే కొద్ది రోజుల క్రితం బన్సాలీ కూడా కరోనా బారిన పడ్డారు. దాంతో అలియా భట్ టెస్ట్ చేసుకోగా నెగిటివ్ వచ్చింది. కానీ తాజాగా మరోసారి కరోనా టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది. ఇక అలియా బాయ్ ఫ్రెండ్ రన్బీర్ కపూర్ సైతం కరోనా బారిన పడ్డారు. ఇదిలా ఉండగా అలియా భట్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లోనూ పాల్గొంటుంది దాంతో ఆర్ఆర్ఆర్ టీమ్ టెన్షన్ లో ఉంది.

More Related Stories