English   

ఆ హీరో కొడుకు ప‌క్క‌న హీరోయిన్ గా రోజా కూతురు

Roja
2021-04-02 17:20:41

సినీ ప‌రిశ్ర‌మ‌లో హీరోల కొడుకులు హీరోలుగా రావ‌డం రానించ‌డం కామ‌న్. కానీ హీరోయిన్ ల వార‌సులు రావ‌డం కాస్త అరుదుగానే క‌నిపిస్తుంది. కానీ ఇటీవ‌ల సీనియ‌ర్ హీరోయ‌న్ ల కూతుళ్లు ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి బాగా‌నే స‌క్సెస్ అవుతున్నారు. అయితే తాజాగా సీనియ‌ర్ హీరోయిన్ న‌టి రోజా త‌న కూతురును హీరోయిన్ గా లాంఛ్ చేసేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుపుతున్నార‌ని ఫిల్మ్ న‌గ‌ర్ లో టాక్ వినిపిస్తోంది.

ప్ర‌స్తుతం రోజా అనారోగ్యం బారిన ప‌డి చెన్నై లోని అపోలో ఆస్ప‌త్రిలో రెండు మేజ‌ర్ స‌ర్జ‌రీలు చేయించుకున్నారు. అయితే గ‌తంలోనే రోజా త‌న కూతురి లాంఛింగ్ కు ప్ర‌య‌త్నాలు జ‌రిపినట్టు తెలుస్తుంది. అంతే కాకుండా ఇప్పుడు ఆ ప్ర‌య‌త్నాలు స‌ఫ‌లం అయిన‌ట్టు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. 

టాలీవుడ్ లో రొమాంటిక్ ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్న సీనియ‌ర్ ద‌ర్శ‌కులు రాఘవేంద్ర‌రావు రోజా కూతురును లాంఛ్ చేయ‌నున్నార‌ని స‌మాచారం. అంతే కాకుండా హీరో శ్రీకాంత్ కుమారుడు న‌టిస్తున్న పెళ్లిసంద‌డి సినిమాలోనే హీరోయిన్ గా రోజా కూతురిని ఎంపిక చేయ‌నున్నార‌ని టాక్ వినిపిస్తుంది. అయితే ఇందులో ఎంత వ‌ర‌కు నిజం ఉందో తెలియాలంటే మాత్రం అఫీషియ‌ల్ అనౌన్స్మెంట్ వ‌చ్చేవ‌ర‌కు ఆగాల్సిందే. 

More Related Stories