మూడో సినిమాను మొదలు పెట్టిన ఉప్పెన హీరో

మెగామేనల్లుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెన తోనే బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. సినిమా కథ బాగుండటంతో పాటు వైష్ణవ్ నటన బాగుండటం..సినిమాలో హీరోయిన్ గా నటించిన కృతి శెట్టి తన నటనతో ఆకట్టుకోవడంతో ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. అంతే కాకుండా సినిమాలో విజయ్ సేతుపతి తన నటనతో ఫిదా చేశారు. ఇక ఈ సినిమా విజయం తరవాత వైష్ణవ్ తేజ్ కు వరుస ఆఫర్ లు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే వైష్ణవ్ పలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ఇక వైష్ణవ్ ప్రముఖ నిర్మాత బీవీఎస్ ప్రసాద్ నిర్మాణంలో ఓ సినిమా చేస్తానని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలను హైదరాబాద్ లో నిర్వహించి అధికారికంగా లాంఛ్ చేశారు. ఈ సినిమాకు తమిళంలో అర్జున్ రెడ్డి సినిమాను రీమేక్ చేసిన దర్శకుడు గిరీశాయ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన హీరోయిన్ గా కేతికా శర్మ నటిస్తోంది. ఇక ఈ పూజా కార్యక్రమానికి నటీనటులతో పాటు దర్శక నిర్మాతలు హాజరయ్యారు. అంతే కాకుండా యంగ్ హీరో..వైష్ణవ్ తేజ్ అన్న సాయిధరమ్ తేజ్ ఈ సినిమాకు క్లాప్ కొట్టారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక కేతికా శర్మ ఇప్పటికే పూరీ జగన్నాత్ తనయుడు హీరోగా నటించిన రోమాంటిక్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో మెగా ఛాన్స్ అందుకుంది.