English   

క్రిష్ సినిమా కోసం కష్టపడుతున్న పవన్ కళ్యాణ్ 

Pawan Kalyan
2021-04-02 18:34:57

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహరవీరమల్లు సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మొదటి సారిగా పవన్ కళ్యాణ్ పిరియాడికల్ స్టోరీలో నటిస్తున్నారు. అంతే కాకుండా ఈ చిత్రంలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ అంటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్లు, మోషన్ పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

తాజాగా పవన్ కళ్యాణ్ ఓ యుద్ధ సన్నివేశానికి సిద్ధం అవుతున్న ఫోటోలను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ  ఫోటోలలో పవన్ కళ్యాణ్ కు శావోలిన్ యోధుడు షిఫు హార్ష్ వెర్మా హెచ్ షాలిన్వామ స్టంట్ ను నేర్పిస్తున్నారు. ఇక ఉదయం 7 గంటల కంటే ముందే పవన్ దానికోసం ప్రాక్టీస్ ను మొదలు పెట్టారు. ప్రస్తుతం పవన్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో ఓ భారీ యుద్ధ సన్నివేశం కూడా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా ఈనెల 9 న రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన సినిమా ట్రైలర్ పై మంచి రెస్పాన్స్ వచ్చింది.

More Related Stories