English   

ఫైన‌ల్ ‌క‌ట్ చూసా..ట‌క్‌ జ‌గదీష్ బ్లాక్ ‌బస్టర్‌.. నాని

nani
2021-04-02 19:06:58

హీరో నాని, దర్శకుడు శివ నిర్మాణ కాంబినేషన్‌లో వస్తున్న‘టక్‌ జగదీష్‌’పై భారీ అంచ‌నాలు నెలకొన్నాయి. ఏప్రిల్ 23న సినిమా వ‌ర‌ల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ కానుంది. సినిమా ఫైన‌ల్ క‌ట్ చూసిన నాని ఎగ్జ‌యిట్‌మెంట్‌తో వున్నాడు.  "పదిహేనేళ్ల క్రితం ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో కోసం మన ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసేవాళ్ల‌మో అలాంటి ఎగ్జ‌యిట్‌మెంట్‌ను ఇచ్చే సినిమా ‘టక్‌ జగదీష్‌’. అంద‌రితో క‌లిసి ఫ‌స్ట్ డే మార్నింగ్ షో చూసే వర‌కు ఈ ఎగ్జ‌యిట్మెంట్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. సినిమా ఫైన‌ల్ క‌ట్ చూసుకున్నాం కాబ‌ట్టి టీమ్ అందరిలో తెలియని ఓ ఎగ్జ‌యిట్మెంట్ నిండిపోయింది. డైరెక్ట‌ర్ శివ నిర్వాణ‌తో అలా మాట్లాడాను.  ఫిక్సయిపో..బ్లాక్‌బస్టర్‌ అని చెప్పాను. అలాంటి ఓ ఎగ్జ‌యిట్‌మెంట్ మా అంద‌రిలో  ఉంది. కెరీర్‌ పరంగా నాకు చాలా సంతృప్తిని ఇచ్చిన సినిమా ఇది. ఈ ఏప్రిల్ నెల‌కు ట‌క్ జ‌గ‌దీష్ మంత్ అనే హ్యాష్‌ట్యాగ్ కూడా పెట్టాం."  అని నాని అన్నాడు. 

More Related Stories