English   

లవ్ స్టోరిపై అంచనాలు పెంచిన సారంగ దరియా.. శేఖర్ కమ్ముల

Sekhar Kammula
2021-04-02 19:32:25

లవ్ స్టోరి చిత్రంలోని 'సారంగ దరియా' పాట యూట్యూబ్ వ్యూస్ లో కొత్త చరిత్ర సృష్టించింది. కేవలం 32 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్ సాధించింది. సౌతిండియాలో మరే లిరికల్ సాంగ్ ఇంత తక్కువ టైమ్ లో వంద మిలియన్ మార్క్ చేరుకోలేదు. సారంగ దరియా సాధించిన ఈ సక్సెస్ నేపథ్యంలో దర్శకుడు శేఖర్ కమ్ముల స్పందించారు. 

''సారంగ దరియా విజయం ఊహించిందేనని, అయితే ఇంత భారీ రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదని ఆయన అన్నారు. శేఖర్ కమ్ముల మాట్లాడుతూ....రెండు, మూడేళ్ల క్రితమే సారంగ దరియా పాట విన్నాను. అవకాశం వచ్చినప్పుడు ఈ పాటను సినిమాలో పెట్టుకోవాలి అనుకున్నాను. సందర్భం, సీన్ కుదరడం వల్ల "లవ్ స్టోరి" చిత్రంలో సారంగ దరియా పాటను తీసుకున్నాను. ఈ పాట విజయం ఊహించిందే, అయితే ఇంత భారీ రెస్పాన్స్ ఎక్స్ పెక్ట్ చేయలేదు. 

లిరికల్ వీడియోనే 100 మిలియన్ వ్యూస్ సాధిస్తుందని అనుకోలేదు. మా టీమ్ అంతా ఉద్వేగంగా ఉన్నాము. సినిమా ఎప్పుడు చూద్దామా, పాట ఎలా ఉంటుంది అనేది చూసేందుకు ఎదురుచూస్తున్నారు. నా టీమ్ అందరికీ థాంక్స్. మెయిన్ క్రెడిట్ గీత రచయిత సుద్దాల అశోక్ తేజ గారికి ఇవ్వాలి. జానపద గీతాన్ని తీసుకుని తనదైన ముద్రతో అద్భుతంగా ఈ పాట రాశారు. ఇంత విజయానికి కారణం అయ్యారు. గాయని మంగ్లీ తనదైన శైలిలో పాడి పాటకు ఆకర్షణ తీసుకొచ్చింది. సాయి పల్లవి డాన్స్ ఎంత బాగుంటుందో అందరికీ తెలిసిందే. శేఖర్ మాస్టర్ అద్భుతంగా స్టెప్స్ చేయించారు. ఈ లిరికల్ వీడియోకు వచ్చిన దానికంటే పది రెట్లు సినిమాలో వీడియో సాంగ్ కు వస్తుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నాను'' అన్నారు.

More Related Stories