English   

తలైవి మొదటి పాటను రిలీజ్ చేసిన సమంత 

Samantha
2021-04-02 19:51:21

దివంగత సినీ నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’. త‌లైవి మూవీ తెలుగు మొద‌టి పాట‌ను స‌మంత అక్కినేని రిలీజ్ చేశారు.   తలైవి ట్రైలర్‌ ఆమెను ఎంత‌ ఆకట్టుకుందో పంచుకున్న తరువాత, సమంత ఈ చిత్రం యొక్క మొదటి పాటను రిలీజ్ చేశారు. ఏఎల్ విజయ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ మూవీలో బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ టైటిల్‌ పాత్ర పోషిస్తుండగా.. విలక్షణ నటుడు అరవింద్ స్వామి ఎంజీఆర్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. . ‘తలైవి’ సినిమాను తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.  ఈ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. విశాల్ విఠల్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. 

More Related Stories