పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యసనం..నిర్మాత బండ్ల గణేష్

పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్' సినిమా నిన్నరాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకుంది. ఈ సందర్భంగా ఈ వేదికపై బండ్ల గణేశ్ మాట్లాడాడు. ఆయన స్టేజ్ పైకి వస్తూనే .. "ఈశ్వరా .. పవనేశ్వరా .. పవరేశ్వరా" అంటూ అభిమానుల్లో ఒక్కసారిగా ఉత్సాహాన్ని రేకెత్తించాడు.
పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యసనం. అలవాటు చేసుకుంటే వదలలేం. కొందరిని ఇష్టపడటమే గానీ వదులుకోవడం ఉండదు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ దగ్గరకు వెళ్లి మీరు పదో తరగతి బాగా పాసయ్యారు అంటే కింద నుంచి పై దాకా చూస్తారు. పవన్ గారికి హిట్స్, సూపర్ హిట్స్ అంతే. ఆయన చూడని విజయాలా, ఆయన సాధించని రికార్డులా, ఆయన చూడని బ్లాక్ బస్టర్లా, ఆయన సృష్టించని చరిత్రలా, ఇవన్నీ ఆయన జీవితంలో ఒక భాగం అంతే.
ఒక ఫ్రెండ్ నాతో అన్నాడు ఏరా మీ బాస్ సినిమాలు అంటాడు రాజకీయం అంటాడు అని. నేను చెప్పాను. ఒరేయ్ ఆయనకు మనలా పాల వ్యాపారం, మందు వ్యాపారం, కోళ్ల వ్యాపారం ఇలాంటివేవీ తెలియదు. ఆయనకు తెలిసిందల్లా బ్లడ్ వ్యాపారం. రక్తాన్ని చెమటగా మార్చి, ఆ చెమటతో నటించి మనకు సంతోషాన్ని కలిగిస్తుంటారు అన్నాను.
నేను నిజంగా పవన్ కళ్యాణ్ భక్తుడినే. ఏడుకొండల వాడికి అన్నమయ్య, శివయ్యకు భక్త కన్నప్ప, శ్రీరాముడికి హనుమంతుడు, పవర్ స్టార్ కు బండ్ల గణేష్ అని సగర్వంగా చెప్పుకుంటా. దీంతో పవన్ తో సహా ఆడిటోరియం అంతా నవ్వుల్లో మునిగిపోయింది.