సందీప్ కిషన్ గల్లీరౌడీ కథ ఇదేనట

యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం గ్యాప్ లేకుండా సినిమాలు తీస్తున్నారు. ఇటీవలే సందీప్ కిషన్ నటించిన ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా మంచి విజయం సాధించింది. ఇక ఇదే జోష్ లో సందీప్ కిషన్ మరో సినిమా గల్లీ రౌడీని మొదలు పెట్టారు. మొదట ఈ సినిమాకు రౌడీ బేబీ అని పెట్టాలను కున్నారట. కానీ ఆ టైటిల్ ను దిల్ రాజు కోరడంతో గల్లీ రౌడీని ఫిక్స్ చేశారట. ఇక గల్లీ రౌడీ సినిమా ప్రెస్ మీట్ తాజాగా జరిగింది.
ఈ సందర్భంగా సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నందిని రెడ్డి మరియు వివి వినాయక్ లు హాజరయ్యారు. ఎంవీవీ సత్యనారాయణ ఈ సినిమాను నిర్మిస్తుండగా కోనవెంకట్ సమర్పిస్తున్నారు. ఈ సినిమాకు నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.
అయితే ఈ కార్యక్రమంలో సందీప్ కిషన్ మాట్లాడుతూ..కథ ఇలా ఉంటుందని చెప్పేశారు. ఈ సినిమాలో హీరో తాత తండ్రి ఇద్దరూ రౌడీలే అయితే హీరోకు మాత్రం రౌడీ అవ్వడం ఇష్టం లేదట. కానీ బలవంతంగా రౌడీయిజం చేయించాలని ప్రయత్నిస్తారట. అంతే కాకుండా ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ ఓ భయస్తుడైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారట. ఇక ఈ సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ అందించే సినిమాగా నిలుస్తుందని సందీప్ కిషన్ దీమా వ్యక్తం చేశారు.