నాకు కరోనా వచ్చింది..అల్లు అరవింద్

కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్ ప్రభావం సినీ పరిశ్రమపై కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు కరోనా బారిప పడిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా తనకు కరోనా రావడంపై అల్లు అరవింద్ స్పందించారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ..తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు వార్తలు వస్తున్నాయని..కరోనా లక్షణాలు తనకు ఉన్నాయని పాజిటివ్ కూడా వచ్చిందని అన్నారు.
అయితే కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నాక కూడా కరోనా వచ్చిందని కథనాలు వస్తున్నాయని. కానీ తాను తీసుకుంది ఒకే డోస్ అని అన్నారు. తన ఇద్దరు మిత్రులతో కలిసి టూర్ కు వెళ్లి వచ్చాక కరోనా పాజిటివ్ వచ్చిందని అరవింద్ తెలిపారు. అయితే టూర్ కు వెళ్లిన వారిలో తనతో పాటు మరో మిత్రుడు వ్యాక్సిన్ తీసుకున్నాడని. కానీ మరో ఫ్రెండ్ మాత్రం వ్యాక్సిన్ తీసుకోలేదని పేర్కొన్నాడు.
వ్యాక్సిన్ తీసుకోని వ్యక్తి ఎక్కువ లక్షణాలతో ఆస్పత్రిలో చేరాడని అరవింద్ వెళ్లడించారు. వ్యాక్సిన్ తీసుకున్న కారణంగానే తమకు తక్కువ లక్షణాలు ఉన్నాయని ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నామని తెలిపారు. అంతే కాకుండా అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని అరవింద్ వీడియోలో పేర్కొన్నారు.