English   

కొడుకును హీరోగా పరిచయం చేయబోతున్న తేజ

 Teja
2021-04-06 12:48:47

టాలీవుడ్ లో ఇప్పటికే పలువురు దర్శకులు తమ కుమారులను హీరోగా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ లిస్ట్ లో దర్శకుడు తేజ కూడా చేరబోతున్నారు. తేజ తన కుమారుడిని హీరోగా లాంచ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారట. చాలా కాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన తేజ   ..రానా హీరోగా నేనే రాజు నేనే మంత్రి సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. దాంతో ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ఇక తేజ ఇప్పటికే తాను దర్శకత్వం వహించిన చిత్రం సినిమాకు సీక్వెల్ గా చిత్రం 1.1 ను తెరకెక్కిస్తానని ప్రకటించారు. 

అంతే కాకుండా ఈ సినిమాకు ఆర్పీ పట్నాయక్ స్వరాలు సమకూరుస్తారని వెల్లడించారు. అయితే ఈ సినిమాలో మొదట ఎన్టీఆర్ బావమరిది హీరోగా లాంచ్ అవుతారని గుస గుసలు వినిపించాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఆయన ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నట్టు తెలుతోంది. ఆ స్థానంలో హీరోగా తేజ కొడుకు అమితవ్ తేజ నటించబోతున్నాడట. అమితవ్ ఇప్పటికే న్యూయార్క్ యాక్టింగ్ స్కూల్ లో శిక్షణ పూర్తి చేశారు. దాంతో ఈ సినిమాలో ఆయన్నే హీరోగా తీసుకోవాలని చూస్తున్నారట. ఇక దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్రిల్ 18 రానుంది. అంతే కాకుండా ఈ సినిమాలో 45 మంది కొత్తవాళ్లను పరిచయం చేస్తానని తేజ ఇప్పటికే స్పష్టం చేశారు.

More Related Stories