English   

సైకిల్ పై వచ్చి ఓటు వేసిన తమిళ సూపర్ స్టార్ విజయ్..

Actor Vijay
2021-04-06 13:01:48

తమిళనాట ప్రస్తుతం ఎన్నికల హడావిడి నడుస్తుంది. ఏప్రిల్ 6న అక్కడ పోలింగ్ జరుగుతుంది. రాష్ట్రం నలు వైపుల ఉన్న జనాలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ క్రమంలో పలువురు సినీ ప్రముఖులు కూడా ఓటు వేయడానికి పోలింగ్ బూత్ కి వచ్చారు. తమిళ సూపర్ స్టార్ విజయ్ చాలా విభిన్నంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

కేవలం తమిళనాడులోనే కాకుండా కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీలకు పోలింగ్ కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో మూడో దశ పోలింగ్ కొనసాగుతోంది. కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో అన్ని ఈసీ జాగ్రత్త చర్యలు తీసుకుంది. ఇక తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 88,936 పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కూడా లైన్ లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 

ఇదిలా ఉంటే తమిళ స్టార్ హీరో విజయ్ సైకిల్ పై పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేశాడు. దేశంలో పెరుగుతున్న పెట్రోల్ ధరలకు నిరసనగానే విజయ్ సైకిల్ పై వచ్చాడంటూ సోషల్ మీడియాలో చర్చలు మొదలైయ్యాయి. పోలింగ్ బూత్ తన ఇంటికి దగ్గరగా ఉండడంతో సైకిల్ పై వచ్చాడు విజయ్. నీలాంగిరి బూత్ వరకు సైకిల్ పై వచ్చిన విజయ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ప్రస్తుతం ఈయన సైకిల్ తొక్కుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

More Related Stories