English   

నా బ‌ర్త్ డే కాదు. డెత్ డే.. వ‌ర్మ

Rgv
2021-04-07 13:48:52

వివాదాల ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ ఈ రోజు పుట్టిన రోజును జ‌రుపుకుంటున్నారు. ఎప్పుడూ వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉండే వ‌ర్మ పుట్టిన రోజు నాడూ అలాంటి వ్యాఖ్య‌లే చేసాడు. ఈ రోజు వర్మ పుట్టిన రోజు కావ‌డంతో సెల‌బ్రెటీలు, ఆయ‌న అభిమానులు వ‌ర్మ‌కు పెద్ద ఎత్తున పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెబుతూ ట్వీట్‌లు చేస్తున్నారు. కాగా త‌న బ‌ర్త్ డే పై ఆర్జీవీ త‌న‌దైన స్టైల్ లో స్పందిచి పోస్ట్ పెట్టారు. ఈ రోజు నా బ‌ర్త్ డే కాదు. డెత్ డే ఎందుకంటే ఈ రోజు నాజీవితంలో ఒక ఏడాది చచ్చిపోయింది. అంటూ ట్వీట్ పెట్టారు. అంతే కాకుండా ఈ ట్వీట్ చివ‌ర‌లో ఏడూస్తూ క‌నిపించే ఈమోజీల‌ను జోడించారు. అంతే కాకుండా వ‌ర్మ‌కు ఓ వ్య‌క్తి హ్య‌పీ బ‌ర్త్ డే అని పుట్టిన రోజు చెప్ప‌గా..నో థ్యాంక్స్ అంటూ రిప్లై ఇచ్చాడు. 

ఇదిలా ఉండ‌గా ఆర్జీవీ తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఎన్నో సినిమాల‌ను తెర‌కెక్కించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ఒక‌ప్పుడు హ‌ర్ర‌ర్ సినిమాల‌తో ప్రేక్ష‌కులను బ‌య‌పెట్టాడు. వ‌ర్మ తీసిన దెయ్యం సినిమా లాంటి చిత్రం ఇప్ప‌టికీ రాలేద‌ని ప‌లువురు సినీ ప్రియులు అభిప్రాయ‌ప‌డుతుంటారు. అంతే కాకుండా వ‌ర్మ నాగార్జున తో తీసిన శివ సినిమా టాలీవుడ్ కు కొత్త పాటాలు నేర్పించింది. ఇండ‌స్ట్రీలో శివ త‌ర‌వాత..శివ కు ముందు అని చెప్పుకునే రేంజ్ లో ఈ సినిమాకు గుర్తింపు వ‌చ్చింది. ఇక ప్రస్తుతం వ‌ర్మ ఎవ‌రికి న‌చ్చినా న‌చ్చ‌క‌పోయినా త‌న‌కు నచ్చిన విధంగా సినిమాలు చేస్తూ హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా విడుద‌ల చేస్తున్నారు. 

More Related Stories