English   

ఐ ల‌వ్ రంగ‌స్థ‌లం..పుష్ప అలాంటి క‌థ : ఫ‌హ‌ద్ ఫాసిల్

fahad fazil
2021-04-07 16:17:56

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా పుష్ప. క్రేజీ దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్లు మరియు ఫస్ట్ గ్లిమ్ప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు ఈ సినిమా టీజర్ ను ఎప్రిల్ 8న సాయంత్రం 6 గంటల కు విడుదల చేస్తానని చిత్ర యూనిట్ ప్రకటించింది. 

ఇదిలా ఉండగా ఈ సినిమాలో మలయాళ నటుడు ఫహాద్ ఫాసిల్ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఫాసిల్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. యాంకర్ మీరు అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమాలో నటిస్తున్నారు కదా.. అందులో మీ పాత్ర ఎలా ఉండబోతుంది..ఎలా ఫీల్ అవుతున్నారు అంటూ ప్రశ్నించింది. దానికి ఫాసిల్ సమాధానం ఇస్తూ...సుకుమార్ తనకు కథ చెప్పారని ఈ సినిమా లో నటించేందుకు చాలా ఎక్సయిట్ అవుతున్నానని చెప్పారు. ఈ సినిమా ఒక ఫ్రెష్ స్టోరీ తో రాబోతుందని అన్నారు. అంతే కాకుండా తాను రంగస్థలం చూశానని..ఐ లవ్డ్ రంగస్థలం అని ఫాసిల్ వ్యాఖ్యానించారు.

More Related Stories