English   

బన్నీకి మెగాస్టార్ బర్త్ డే విషెస్...తగ్గేదేలే

 Allu Arjun
2021-04-08 18:57:44

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సంధర్బంగా అభిమానులు సెలబ్రెటీలు బన్నీకి సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ చెబుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి అల్లు అర్జున్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. అంతే కాకుండా పుష్ప టీజర్ పై మెగాస్టార్ ప్రశంసలు కురిపించారు. మెగాస్టార్ తన ట్వీట్ లో "పుష్ప టీజర్ చూసాను. చాలా రియాలిస్టిక్ గా రస్టిక్ గా ఉంది. పుష్పరాజ్ గా అల్లు అర్జున్ తగ్గేదేలే..!! హ్యాపీ బర్త్ డే మై డియర్ బన్నీ" అంటూ మెగాస్టార్ ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ గంగోత్రి సినిమా తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అంతే కాకుండా మొదటి సినినాతోనే బన్నీ సూపర్ హిట్ అందుకున్నారు. 

ఆర్య, ఆర్య 2 దేశముదురు లాంటి సినిమాలతో అభిమానులను సంపాదించుకున్నారు. ఇక అల వైకుంఠపురంతో రికార్డులు బద్దలు కొట్టారు. అల్లు అర్జున్ కేవలం తెలుగులోనే కాక హిందీ, తమిళ, మలయాళ భాషల్లో సైతం అభిమానులను సంపాదించుకున్నారు. అంతే కాకుండా మలయాళ ఫ్యాన్స్ ఏకంగా మల్లు అర్జున్ అని పిలుచుకునేంతలా వారికి దగ్గరయ్యాడు. ఇక ప్రస్తుతం చేస్తున్న పుష్ప సినిమాతో బన్నీ ప్యాన్ ఇండియా స్టార్ గా మారుతున్నారు. ఇక ఈ సినిమా కూడా మంచి విజయం సాధించి అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదగాలని...ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ..బన్నీకి మా సినిమా పాలిటిక్స్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.

More Related Stories