English   

వకీల్ సాబ్ చూస్తూ థియేటర్ లో దిల్ రాజు హంగామా

 Dil Raju
2021-04-09 12:46:00

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం వకీల్ సాబ్. బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన పింక్ సినిమాకు రీమెక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాను వేణు శ్రీరామ్ తెరకెక్కించారు. బాలీవుడ్ నిర్మాత బోణీకపూర్ , దిల్ రాజు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ మరియు ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఇక పవన్ కళ్యాణ్ రీఎంట్రీ సినిమా కావడం తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్నో అంచనాల మధ్య వకీల్ సాబ్ ఎప్రిల్ 9న ప్రేక్షకుల ముందు వచ్చింది. 

ఇక ఈ సినిమా ప్రీమియర్ షోనుండే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా ను థియేటర్ లో చూసేందుకు పవన్ అభిమానులు, ప్రేక్షకులు మాత్రమే కాకుండా సెలబ్రెటీలు సైతం ఆసక్తి చూపుతున్నారు. తాజాగా ఈరోజు సినిమా నిర్మాత దిల్ రాజు తన భార్యతో కలిసి థియేటర్ లో సినిమా చూసారు. అయితే సినిమా చూస్తున్న సమయంలో  దిల్ రాజు రచ్చ రచ్చ చేశారు. థియేటర్ లో పేపర్లు చింపి గాల్లో విసిరారు. ఇక దిల్ రాజు హంగామాను ఓ అభిమాని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. దాంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More Related Stories