English   

వకీల్ సాబ్ పై మెగా బ్రదర్స్ రివ్యూ

Chiranjeevi
2021-04-10 12:08:26

ఎన్నో అంచనాల మధ్య పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. సూపర్ హిట్ టాక్ తో వకీల్ సాబ్ దూసుకుపోతుంది. పవన్ అభిమానులు...ప్రేక్షకుల తో పాటు సెలబ్రెటీలను సైతం వకీల్ సాబ్ మెప్పించింది. ఇ

క వకీల్ సాబ్ పై మెగా బ్రదర్స్ నాగబాబు..మెగాస్టార్ చిరంజీవి సైతం రివ్యూ ఇచ్చారు. చిరు తన ట్విట్టర్ లో వకీల్ సాబ్ టీమ్ పై ప్రశంసలు కురిపించారు. మూడేళ్ళ తరవత కూడా పవన్ కళ్యాణ్ అదే వాడి.. అదే వేడి. అదే పవర్ చూపించాడని పేర్కొన్నారు. ప్రకాశ్ రాజ్ తో కోర్ట్ డ్రామా అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. నివేదిత థామస్, అంజలి, అనన్య వాళ్ళ పాత్రల్లో జీవించారని చిరు పేర్కొన్నారు. తమన్, డీఓపీ వినోద్ అద్భుతమైన పనితనం చూపించారని తెలిపారు. చిత్ర యూనిట్ కు కంగ్రాట్స్ చెబుతూ..వకీల్ సాబ్ కేసులనే కాకుండా మనసులను కూడా గెలుస్తారని తెలిపాడు. 

ఇక టవర్ స్టార్ నాగబాబు తన ట్వీట్ లో...మూడేళ్ళ నిరీక్షణకు వకీల్ సాబ్ తో జీవిత కాల ఆకలి తీరిందని పేర్కొన్నారు. ఫ్యాన్స్ రివ్యూ రాయమని కోరుతున్నారని..కానీ తాను రివ్యూ ఇవ్వమని చెపినట్టు తెలిపారు. మనలో చాలా మంది ఎదురుకుంటున్న ఒక క్రిటికల్ సమస్యను పరిష్కరించే చిత్రం. అని నాగబాబు పేర్కొన్నారు.

More Related Stories