English   

జ‌బ‌ర్ధ‌స్త్ కు గుబ్ బై చెప్పిన ర‌ష్మి..

 Rashmi Gautam
2021-04-10 12:31:22

టెలివిజన్ రంగంలో ఏడేళ్లుగా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న కామెడీ షో జబర్ధస్త్. తెలుగులో  ఇప్పటివరకు ఎన్ని కామెడీ షోలు వచ్చినా జబర్ధస్త్ షో సక్సెస్ అయినంతగా ఏ షో కూడా సక్సెస్ అవ్వలేదు. ఈ షో సక్సెస్ లో కమెడియన్స్, జడ్జీల తో పాటు యాంకర్స్ పాత్ర కూడా ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవరసం లేదు. మొదట ఈ షోకు అనసూయ యాంకర్ గా వ్యవహరించింది. ఆ తరవాత అనసూయకు తీరిక లేకుండా ఆఫర్లు రావడం ఇతర కారణాల వల్ల జబర్ధస్త్ కు గుడ్ బై చెప్పింది.

ఆ వెంటనే యాంకర్ రష్మీ ఎంట్రీ ఇచ్చింది. పొట్టి పొట్టి బట్టలతో...వయ్యాలతో అనసూయ లేని లోటు జబర్ధస్త్ కు లేకుండా చేసింది. ఇలా దాదాపు ఏడేళ్ల వరకు రష్మి జబర్ధస్త్ కు యాంకర్ గా వ్యవహరించింది. అయితే ఇప్పుడు రష్మీ షో నుండి తప్పుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నో అవకాశాలు వచ్చినా.. మొదట తనకు అవకాశం ఇచ్చిన మల్లె మాలను వీడకుండా రష్మీ ఇన్నేళ్లు జబర్ధస్త్ యాంకర్ గా ఉంది. అయితే తనకు ఇప్పటివరకు మూడు సార్లు మాత్రమే రెమ్యునేషన్ పెంచారనే కారణంగా షో నుండి తప్పుకోవాలని చూస్తుందట.
 

More Related Stories