English   

మ‌హా సముద్రం అదితి ఫస్ట్ లుక్ 

Maha Samudram
2021-04-12 11:13:41

శ‌ర్వానంద్, సిద్ధార్థ్‌ హీరోలుగా ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ అజయ్‌ భూపతి తెరకెక్కిస్తోన్న చిత్రం మ‌హా సముద్రం. ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 19న ‘మహాసముద్రం’ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.  తాజాగా హీరోయిన్ అదితి రావు హైదరి ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో అదితి రావు కన్నీళ్లతో బరువెక్కిన కళ్ళతో చూస్తూ కనిపిస్తోంది. మ‌హా అనే పాత్ర‌లో అదితి నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అనిల్‌ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చైతన్‌ భరద్వాజ్‌ స్వరాలు అందిస్తున్న ఈ సినిమాను తెలుగు, త‌మిళ భాషల్లో తెరకెక్కించారు.

More Related Stories