English   

అడవి శేష్‌ మేజర్‌ టీజర్‌ రివ్యూ 

Adivi Sesh Major
2021-04-12 16:36:21

 థ్రిల్లర్ జానర్‌ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో అడివి శేష్. ఆయన హీరోగా ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న చిత్రం మేజర్.  లేటెస్ట్ గా ఈ సినిమా టీజర్ ను ముగ్గురు సూపర్‌ స్టార్స్‌ విడుదల చేశారు. తెలుగులో సూపర్‌స్టార్‌ మహేశ్‌, హిందీలో బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ఖాన్, మలయాళంలో అగ్ర హీరో పృథ్వీరాజ్‌ ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. 

ఈ పాన్‌ ఇండియా చిత్రానికి శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహించిగా.. మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌గా యంగ్‌ హీరో అడవి శేష్‌ నటించాడు. ‘‘మన బోర్డర్‌లో ఆర్మీ ఎలా ఫైట్‌ చేయాలి? ఇండియా క్రికెట్‌ మ్యాచ్‌ ఎలా గెలవాలి? అని అందరూ ఆలోచిస్తారు. అదీ దేశభక్తే. దేశాన్ని ప్రేమించటం అందరి పని. వాళ్లని కాపాడటం సోల్జర్‌ పని’’ అంటూ టీజర్‌ లో అడివి శేష్ చెప్పిన డైలాగు ఆకట్టుకుంటుంది. 

శోభితా ధూళిపాల, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ ముఖ్య పాత్రల్లో నటించారు. మహేష్ బాబు జిఎమ్‌బి ఎంటర్టైన్మెంట్ మరియు ఏప్ల‌స్ఎస్‌ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. 

More Related Stories