English   

కేసీఆర్ నిర్ణ‌యం పై మంచు విష్ణు హ్యాపీ

 Manchu Vishnu
2021-04-13 10:24:09

క‌రోనా కార‌ణంగా ప్రైవేటు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు. ఎంతో మంది భ‌విష్య‌త్తును తీర్చిదీద్దే ఉపాధ్యాయులు ఉపాధి క‌రువై దిన‌స‌రి కూలీగా మ‌రియు ఇత‌ర పనుల‌కు వెలుతున్నారు. పాఠ‌శాల‌లు మూత ప‌డ‌టంతో ఆన్లైన్ క్లాసులు న‌డుస్తున్నా విద్యార్థులు ఫీజులు స‌కాలంలో చెల్లించ‌ని ప‌రిస్థితి అంతే కాకుండా ఇప్ప‌టికీ కొంత‌మంది ఉపాధ్యాయుల‌కు సగం జీతాలు ఇస్తుండ‌గా మ‌రి కొంద‌రిని ఉద్యోగం నుండే తీసి వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆర్థిక ఇబ్బందుల‌ను త‌ట్టు కోలేక ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌వారు కూడా ఉన్నారు. కాగా ప్రైవేటు టీచ‌ర్లను ఆదుకునేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం ఇటీవ‌ల వారికి నెల‌కు రూ. 2000 స‌హాయం చేస్తామ‌ని ప్ర‌క‌టించింది. అంతే కాకుండా డ‌బ్బుతో పాటు 25 కేజీల బియ్యం కూడా ఇస్తామ‌ని తెలిపింది. 

దాంతో ప్రేవేటు ఉపాద్యాయ‌ల‌కు కొంత‌లో కొంత ఊర‌ట క‌లిగింది. కాగా తాజాగా ఈ విష‌యం పై మంచు విష్ణు స్పందిచారు. తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యాన్ని ఆయ‌న అభినందించారు. ఈమేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు. ట్వీట్ లో క‌రోనా నేప‌థ్యంలో ప్రైవేటు ఉపాధ్యాయులు, సిబ్బందిని ఆదోకోవాల‌నే ఉద్దేశంలో ప్ర‌తినెలా వాళ్ల‌కి రూ. 200న‌గ‌దు...25కిలోల బియ్యాన్ని ఇవ్వాల‌ని నిర్ణ‌యించ‌డం ఓ అద్భుతం. ఈ నిర్ణ‌య‌తో విద్యారంగంలో ఉన్న ఎంతో మంది ఉపాధ్యాయుల‌కు మీపై మ‌రెంతో గౌర‌వం పెరుగుతుంది అంటూ మంచు విష్ణు త‌న ట్వీట్ లో పేర్కొన్నారు. 

More Related Stories