English   

ఆర్ఆర్ఆర్ నుండి ఫ్యాన్స్ కు మ‌రో స‌ర్ప్రైజ్

RRR
2021-04-13 10:47:03

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా లో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు. ఈ సినిమాను జ‌క్క‌న్న ప్యాన్ ఇండియా లెవ‌ల్ లో తెర‌కెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో చరణ్ మ‌ణ్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా...ఎన్టీఆర్ గోండు బెబ్బులి లో కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు.  సినిమా రామ్ చరణ్ కు జోడీగా అలియా భట్ నటిస్తుండగా ఎన్టీఆర్ కు జోడీగా ఒలీవియా మోరీస్ నటిస్తోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంది. అంతా బాగుంటే ఇప్ప‌టివ‌ర‌కు షూటింగ్ పూర్తి చేసుకుని ఈ సినిమా విడుద‌ల కావాల్సింది. కానీ క‌రోనా లాక్ డౌన్ వ‌ల్ల సినిమా షూటింగ్ ఆల‌స్వం అయింది. దాంతో ఈ సినిమాను అక్టోబ‌ర్ 13 విడుద‌ల చేయ‌నున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ సినిమా నుండి చరణ్ ఎన్టీఆర్ వీడియోలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా చిత్ర యూనిట్ మరో పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్ లో ప్రజలంతా సంబురాలు జరుపుకుంటూ ఉండగా ఎన్టీఆర్ చరణ్ లను గాల్లోకి ఎత్తేశారు. దాంతో ఇద్ద‌రి  ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది. ఇక ఈ పోస్టర్ ను చ‌రణ్‌, ఎన్టీఆర్ అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు.

More Related Stories