నారప్ప ఉగాది లుక్ అదిరింది

2021-04-13 18:04:36
విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘నారప్ప’. తమిళ బ్లాక్‌బస్టర్ ‘అసురన్’కు ఇది రీమేక్. శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. ఈ ఏడాది మే14న ‘నారప్ప’ను థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఉగాది సందర్భంగా పోస్టర్ విడుదల చేశారు. తాజా పోస్టర్ లో వెంకటేష్ పంచెకట్టులో కనిపించి ఫ్యాన్స్‌కు అమితానందం కలిగిస్తున్నారు. రాజీవ్ కనకాల, ప్రియమణి కూడా పోస్టర్లో కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలోని కీలక సన్నివేశాలను రాయలసీమలోని అనంతపూర్ పరిసర ప్రాంతాల్లోని రియలిస్టిక్ లొకేషన్లలో చిత్రీకరించారు. ప్రియమణి, కార్తీక్ రత్నం, ప్రకాశ్ రాజ్, మురళీశర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేశ్‌బాబు, కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్నారు.