మరోసారి కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్..రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

2021-04-13 18:19:30
జనతా గ్యారేజ్ సినిమాతో ఐదేళ్ళ కింద సంచలన విజయం సాధించిన జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ, ఇప్పుడు మరోసారి కలిసి పని చేయనున్నారు. ఈ విషయాన్ని కొరటాల శివ సోమవారం అధికారికంగా ప్రకటించాడు. కాగా ఇది తారక్‌కు 30వ సినిమా. ఇక ఈ చిత్రం షూటింగ్ అయినా మొదలు పెట్టకముందే రిలీజ్ డేట్ కూడా ప్రకటించి ఫ్యాన్స్‌ను సర్ప్రైజ్ చేశాడు దర్శకుడు. 'ఇంతకుముందు లోకల్ రిపేరింగ్స్ మాత్రమే చేశాం.. కానీ ఈసారి దాని సరిహద్దులు చెరిపేస్తాం..' అని చెప్పుకొచ్చాడు శివ. దీనిపై తారక్ స్పందిస్తూ.. మరోసారి కొరటాలతో కలిసి పని చేయడం సంతోషంగా ఉందని వెల్లడించాడు.నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రంతో నిర్మాతగా మారుతున్నాడు.