ఆచార్య నుండి మరో సర్ప్రైజ్..నీలాంబరిని పరిచయం చేసిన సిద్ధ

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. ఈ సినిమాలో రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆచార్య లో దాదాపు ముప్పై నిమిషాలపాటు చరణ్ పాత్ర ఉంటుందని దర్శకుడు కొరటాల ఇప్పటికే వెల్లడించారు. దాంతో ఈ సినిమా కోసం మెగా అభిమానులు వేయి కల్లతో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ కు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా రామ్ చరణ్ కు జోడిగా పూజ హెగ్డే నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన రామ్ చరణ్ పోస్టర్ లు అలరించిన సంగతి తెలిసిందే.
కాగా ఉగాది సందర్భంగా హీరోయిన్ పూజా హెగ్డేను పరిచయం చేస్తూ మరో పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో రామ్ చరణ్ పూజ హెగ్డే ను హత్తుకుని ఉన్నారు. అంతే కాకుండా సినిమాలో పూజ పేరు నీలాంబరిగా ఈ పోస్టర్ తో ప్రకటించారు. సిద్ధ ప్రేమలో నీలాంబరి అనే క్యాప్షన్ ను జోడించి చరణ్ ఈ పోస్టర్ ను విడుదల చేశారు. ఇక ఇప్పటికే ఉగాది సందర్భంగా ఆర్ఆర్ఆర్ సినిమా నుండి చరణ్ ఎన్టీఆర్ ల పోస్టర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దాంతో ఒకే రోజు రామ్ చరణ్ అభిమానులకు రెండు సర్పైజ్ లు అందాయి. ఇదిలా ఉండగా ఆచార్య సినిమాకు మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లపై నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని మే 14న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో విడుదల వాయిదా చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.