English   

కారుకూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది...అఖండగా బాలయ్య 

 Balakrishna
2021-04-13 13:22:41

సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్ల తర్వాత డైరెక్టర్ బోయపాటి బాలయ్య  కాంబోలో వస్తోన్న హ్యాట్రిక్ ఫిలిం బిబి 3. ఉగాది పండగని పురస్కరించుకుని అభిమానులకు సర్‌ప్రైజ్‌ అందించింది.  బాలయ్య సినిమా టైటిల్ ను అనౌన్స్ చేశారు చిత్రయూనిట్. ఈ మేరకు టీజర్ ను విడుదల చేశారు.  గత సినిమాల మాదిరిగానే ఈసినిమాకు కూడా అఖండ అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఎంచుకున్నాడు బోయపాటి. ఇక ఈసినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేయబోతున్నారు. అందులో ఒకటి అఘోర పాత్ర. అఘోరాగా నటసింహం లుక్ అదిరిందంటున్నారు అభిమానులు.

‘‘హర హర మహాదేవ.. శంభో శంకర.. కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది.. కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది’’.. అంటూ తన స్టైల్లో డైనమెట్ లాంటి డైలాగ్ పేల్చాడు బాలయ్య. ఇక ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ఈ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. బాలయ్యకు జోడీగా కంచె బ్యూటీ ప్రజ్ఞ జైస్వాల్ నటిస్తుంది. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. 
 

More Related Stories