English   

ముట్టుకోవద్దంటే... ముట్టుకోవద్దు..వకీల్ సాబ్ ప్రోమో 

Pawan Kalyan
2021-04-14 13:23:36

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమా వకీల్ సాబ్. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన పింక్ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమాలో పవన్ కు జోడిగా శృతి హాసన్ నటించింది. ఇక ఈ చిత్రాన్ని ఎప్రిల్ 9 న విడుదల చేసారు. కాగా ఈ సినిమాకు మార్నింగ్ షోతోనే సూపర్ హిట్ టాక్ వచ్చింది. సినిమాలో పవన్ కళ్యాణ్ కోర్టు సన్నివేశాల్లో నటించిన విధానానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అంతే కాకుండా ఎమోషనల్ సీన్లకు భాగా కనెక్ట్  అయ్యారు. 

ఇక ప్రస్తుతం ఈ చిత్రానికి కలెక్షన్ల వర్షం కురుస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా నుండి మరో ప్రోమో ను చిత్ర యూనిట్ వదిలింది. ఈ ప్రోమోలో పవన్ కళ్యాణ్ "ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా ఏ మగాడు ముట్టుకోవద్దు..ముట్టుకోవద్దంటే ముట్టుకోవద్దు..ఫ్రెండ్ అయినా బాయ్ ఫ్రెండ్ అయినా ఏ మగాడయినా.. చివరికి భర్త అయినా" అంటూ డైలాగ్ చెప్పారు. ఇక ప్రస్తుతం పవన్ అభిమానులు ఈ ప్రోమోను ట్రెండ్ చేస్తున్నారు.

More Related Stories