English   

ఓటీటీ లో శర్వానంద్ శ్రీకారం..రిలీజ్‌ డేట్‌ ఇదే

Sharwanands Sreekaram
2021-04-15 13:18:00

భారీ అంచనాలతో వచ్చిన పడిపడి లేచే మనసు, రణరంగం, జాను లాంటి సినిమాలు హీరో శర్వానంద్ కోరుకున్న విజయం ఇవ్వలేదు. ఇలాంటి సమయంలో వచ్చిన సినిమా శ్రీకారం. వ్యవసాయం కాన్సెప్టుతో కొత్త దర్శకుడు కిషోర్ తెరకెక్కించిన ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.  అయితే ఈ సినిమాకు మాత్రం ఊహించిన వసూళ్లు రాలేదు.   జాతిరత్నాలు పోటీ ఇవ్వడటంతో రేసులో కాస్త వెనకబడింది ఈ చిత్రం. 

అయితే  ఈ సినిమాను ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు మేకర్స్. రేపటి నుంచి (ఏప్రిల్ 16) నుంచి సన్ నెక్స్ట్ యాప్ లో శ్రీకారం మూవీ స్ట్రీమింగ్ కానుంది.  థియేటర్లలో ఈ సినిమా చూడటం మిస్‌ అయిన వారు రేపటి నుంచి ఈ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో చూసేయండి.. ఇదిలా వుంటే జాతి రత్నాలు, శశి సినిమాలు ఇప్పటికే అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. 

More Related Stories