English   

బండ్ల గణేష్ కు కరోనా.. ఐసీయూ నుండి గదికి షిఫ్ట్

Bandla Ganesh
2021-04-15 16:10:05

దేశంలో ప్రస్తుతం కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా రోజు రోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో చిన్నోళ్లు పెద్దోళ్ళు వణికిపోతున్నారు. దీంతో ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు కూడా ఈ సెకండ్‌ వేవ్‌ కారణంగా కోరోనా బారీన పడుతున్నారు. ఇక కొద్దీ రోజుల క్రితం  సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్ మరోసారి కోవిడ్‌ బారిన పడ్డారు. ఆయనకు జ్వరంతో పాటు కోవిడ్‌ లక్షణాలు తీవ్రంగా ఉండడంతో అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తుంది. దింతో జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స  తీసుకుంటున్నారు.  తాజాగా ఆయన ఆరోగ్యం పై వైద్యులు సమాచారం విడుదల చేసారు.  నిర్మాత బండ్ల గణేష్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. బండ్ల గణేష్‌ను ప్రత్యేక గదిలోకి తరలించి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. 
 

More Related Stories