English   

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ను రెచ్చ‌గొడుతున్న వ‌ర్మ

Ram Gopal Varma
2021-04-17 11:25:59

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా తెలియజేసింది. డాక్టర్ల పర్యవేక్షణలో ఆయన మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చికిత్స తీసుకుంటున్న ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసారు. ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేస్తూ.. పవన్ కళ్యాణ్‌కు  కరోనా సోకింది. 

ఆయన అభిమానులను ఉద్దేశిస్తూ.. హే పీకే ఫ్యాన్స్.. కరోనా వైరస్‌ను పచ్చడి చేసి చంపేయండి అంటూ కాస్తా వ్యంగ్యంగా ట్వీట్ చేసాడు. ఇపుడీ ట్వీట్ సోషల్  మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన పీకే ఫ్యాన్స్ నిజంగానే రెచ్చిపోతున్నారు. వర్మ గారు మీరు కాసేపు కూడా కామ్ గా ఉండలేరా.. ఎందుకు సార్ కావాలని రెచ్చగొడుతున్నారు అంటూ ఆయనకు కొందరు మర్యాదగా కామెంట్స్ పెడుతుంటే.. మరికొందరు మాత్రం కాస్త నాటుగానే సమాధానం ఇస్తున్నారు.

More Related Stories