English   

చరణ్ కు రెమ్యూనేషన్ ఇవ్వాలంటున్న నాగబాబు

 Nagababu
2021-04-17 13:35:42

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ఆరెంజ్ సినిమాను నాగబాబు నిర్మించిన సంగతి తెలిసిందే. సినిమా కథ పై ఉన్న నమ్మకంతో ఈ చిత్రాన్ని ఎంతో కమర్షియల్ గా నిర్మించారు. దాంతో ఈ సినిమా కోసం భాగానే ఖర్చు చేశారు. కానీ సినిమా మాత్రం అంచనాలను రీచ్ అవ్వలేకపోయింది. బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. దాంతో నాగబాబు తీవ్రంగా నష్టపోయారు. ఈ సినిమా కోసం అప్పులు చేసి పెట్టగా ఆ తరవాత ఎన్ని ఇబ్బందులు కూడా ఎదురుకున్నారు. 

ఇక ఆయన చాలా సందర్భాల్లో ఆరెంజ్ సినిమా వల్ల నష్టపోయానని అన్నారు. కాగా తాజాగా ఇన్స్టాగ్రామ్ లో ఫ్యాన్స్ తో చిట్ చేసిన నాగబాబు మరోసారి ఈ సినిమా గురించి మాట్లాడారు. ఓ నెటిజెన్ "ఆరెంజ్ సినిమాకు చరణ్ కు రెమ్యునేషన్ ఇచ్చారా.? " అని ప్రశ్నించగా... నాగ బాబు " నా సగం అప్పులు మా అన్నయ్య కట్టారు. చరణ్ కు ఫ్యూచర్ లో అయినా రెమ్యునేషన్ ఇవ్వాలి" అని చెప్పారు. ఇక ప్రస్తుతం నాగబాబు టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ నటిస్తున్నారు. అంతే కాకుండా వరుణ్ తేజ్ కూడా సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. దాంతో చరణ్ రెమ్యునేషన్ ఇప్పటికైనా ఇవ్వాలనుకుంటున్నారు.

More Related Stories